నెల్లూరు: రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి పొంగూరు నారాయణ విమర్శించారు. వారి మాటలకు ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించి, పంటకాలువల పునరుద్ధరణతో పాటు ప్రజాదర్బార్లో వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.