TG: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో విషాదం చోటుచేసుకుంది. నాయకన్ గూడేనికి చెందిన ఓ యూకేజీ విద్యార్థి పెన్సిల్ గుచ్చుకుని చనిపోయాడు. విహార్(6) అనే విద్యార్థి టాయిలెట్‌కి వెళ్లి తిరిగి పరిగెత్తుకుంటూ తరగతి గదికి వెళ్తుండగా అదుపుతప్పి కిందపడిపోయాడు. అదే సమయంలో అతని చేతిలో ఉన్న పెన్సిల్ చిన్నారి గొంతులో గుచ్చుకుంది. దీంతో తీవ్ర రక్తస్రావమై మృతి చెందాడు.