VZM: ఎస్ కోట మండలం కిల్తంపాలెం రెవిన్యూ పరిధిలో చెరువుల ఆక్రమణలను తహసీల్దార్ శ్రీనివాసరావు బుధవారం తన సిబ్బందితో కలిసి పరిశీలించారు. కిల్తంపాలెం రెవెన్యూ పరిధిలో పలు చెరువుల్లో ఆక్రమణలను గుర్తించినట్లు ఆయన తెలిపారు. ఆక్రమణదారులకు త్వరలో నోటీసులు పంపిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.