NZB: భీమగల్ న్యూ బస్టాండ్ నుంచి బస్సుల రాకపోకలు ప్రారంభం కావడంతో, బస్టాండ్‌లో బ్లేడ్ ట్రాక్టర్‌తో క్లీనింగ్, లెవెలింగ్ పనులు చేపట్టారు. ఈ పనులను మున్సిపల్ కమిషనర్ గంగాధర్ స్వయంగా పరిశీలించారు. బస్టాండ్ ఆవరణలో చెత్తాచెదారం లేకుండా చూడాలని, రాత్రి వేళ ఇబ్బందులు లేకుండా లైటింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.