VZM: వినియోగదారుల సౌకర్యార్థం రోజురోజుకు కన్జ్యూమర్ కమిషన్ వినియోగదారులకు చేరువవుతుందని వినియోగదారుల కమిషన్ ఛైర్మన్ ఆర్ వెంకట నాగ సుందర్ పేర్కొన్నారు. బుధవారం ప్రభుత్వ సంస్కృత ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగిన జాతీయ వినియోగదారుల దినోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అన్యాయం జరిగినప్పుడు కోర్టుల చుట్టూ తిరగకుండా కన్జ్యూమర్ కమిషన్ను ఆశ్రయించవచ్చని తెలిపారు.