VKB: తాండూరులోని ఓ రెస్టారెంట్లో బిర్యానీ తినడానికి వచ్చిన కస్టమర్లకు షాకింగ్ ఘటన ఎదురైంది. తమకు అందించిన బిర్యానీలో కుళ్లిపోయిన చికెన్ ఉందని హోటల్ యజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అపరిశుభ్రమైన ఆహారాన్ని విక్రయిస్తున్న హోటళ్లపై ఫుడ్ కమిషన్ అధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.