AP: రాష్ట్రంలోని గిరిజనప్రాంత ఆస్పత్రులకు ఇకపై డ్రోన్ల ద్వారా మందులను సరఫరా చేయనున్నారు. ఇందుకోసం పాడేరును కేంద్రంగా చేసుకుని సేవలు అందించేలా ఓ ప్రైవేటు సంస్థతో ఆరోగ్యశాఖ ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే నెలాఖరు నుంచి ఈ డ్రోన్ల ద్వారా మందుల సరఫరా ప్రారంభం కానుంది. అంతేకాకుండా, భవిష్యత్తులో ఈ సేవలను విశాఖ KGH నుంచి పాడేరుకు విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది.