HYD: పుప్పాల్‌గూడలో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ అర్ధరాత్రి దౌర్జన్యానికి పాల్పడింది. సర్వే నంబర్ 300లో బోర్డులు తొలగించి, JCBలతో ప్రహారీని కూల్చి పట్టా పొలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించినట్లు బాధితులు ఆరోపించారు. అడ్డుకున్న యజమానులపై బౌన్సర్లతో దాడి చేయగా, పోలీసులకు సమాచారం అందింది. నార్సింగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.