TG: కేసీఆర్ ఉడత ఊపులకు భయపడేవాణ్ని కాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘రెండేళ్ల తర్వాత కేసీఆర్ బయటకు వచ్చారు. పగ సాధించడం మొదలు పెడితే రాష్ట్రానికి నష్టం జరుగుతుందని వదిలిపెట్టా. నేను ప్రమాణం చేసినప్పుడే కేసీఆర్ కూలబడ్డారు. ఇంతకంటే పెద్ద శిక్ష ఇంకేం ఉంటుంది. ఫాంహౌస్‌ను కేసీఆర్ బందీఖానాగా మార్చుకున్నారు’ అని విమర్శించారు.