EG: రాజమండ్రి నగరంలో అనుమతులకు విరుద్ధంగా చేపడుతున్న భవన నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు. బుధవారం గాంధీనగర్, గాదాలమ్మ నగర్ ప్రాంతాల్లో ఆయన పర్యటించి, నిర్మాణంలో ఉన్న భవనాలను తనిఖీ చేశారు. ప్లానింగ్‌కు, క్షేత్రస్థాయి నిర్మాణాలకు మధ్య వ్యత్యాసం ఉంటే ఉపేక్షించవద్దని టౌన్ ప్లానింగ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.