ATP: జిల్లా టీడీపీ నూతన అధ్యక్షుడు పూల నాగరాజు బుధవారం విజయవాడలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్లో జరిగిన ఈ భేటీలో ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను కూడా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ పటిష్టతకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.