SKLM: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అసెంబ్లీ కమిటీ హాల్లో బుధవారం సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆమదాలవలస నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర పియుసి ఛైర్మన్ కూన రవికుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా స్వచ్ఛ ఆంధ్రా కార్పొరేషన్, ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్, ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులతో వార్షిక నివేదికలపై చర్చించారు.