NLG: మిర్యాలగూడ పట్టణ పారిశుద్ధ్య పరిరక్షణకు మున్సిపల్ సిబ్బంది కృషి చేయాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. పురపాలిక ఆధ్వర్యంలో పారిశుధ్య, నీటి సరఫరా సిబ్బందికి బుధవారం పీపీఈ కిట్లను పంపిణీ చేశారు. జీవీపీ పాయింట్లు వద్ద సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు.