కృష్ణా: గన్నవరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 27న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డీ.కే. బాలాజీ ఒక ప్రకటనలో బుధవారం తెలిపారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరిగే ఈ మేళాలో పలు కంపెనీలు పాల్గొంటాయని చెప్పారు. టెన్త్ నుంచి డిగ్రీ వరకు 18–35 ఏళ్ల యువత అర్హులని పేర్కొన్నారు. సమచారం కోసం 9676708041, 9494005725 నంబర్లను సంప్రదించాలన్నారు.