KNR: గ్రామాల అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో నూతనంగా ఎన్నికైన బీజేపీ సర్పంచుల సన్మాన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సర్పంచ్,ఉపసర్పంచ్ మధ్య సమన్వయం ఉండాలని, ప్రజల సహకారంతో గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని సూచించారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగించాలని తెలిపారు.