MBNR: BRS సీనియర్ నేత, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యదర్శి బాబుల్ రెడ్డి తండ్రి బాల్ రెడ్డి మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ బుధవారం పీర్లబావిలో బాల్ రెడ్డి పార్థివ దేహానికి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం బాబుల్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.