VSP: నగర ప్రజలకు మౌలిక వసతులు కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. బుధవారం మూడవ జోన్ 18వ వార్డు పరిధిలోని ఎంవిపి కాలనీ సెక్టర్ 9లో సుమారు రూ.66.50 లక్షల జీవీఎంసీ నిధులతో నిర్మించిన సామాజిక భవనం మొదట అంతస్తు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీ భరత్ పాల్గొన్నారు.