TG: కొడంగల్ నియోజకవర్గాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్ లోని ప్రతి గ్రామం, తండాకు రోడ్లు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగాల కోసం పారిశ్రామిక వాడ ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికలు ముగిశాయి.. ఇక రాజకీయాలకు తావులేదని ఉద్ఘాటించారు. కొడంగల్ ప్రజలకు అందుబాటులో తన సోదరుడు తిరుపతి రెడ్డిని ఉంచినట్లు చెప్పారు.