WGL: పశు వైద్య శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న ఉచిత నట్టల నివారణ కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. దామెర మండలం ఊరుగొండ గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని గొర్రెలకు నట్టల నివారణ మందులను పంపిణీ చేశారు. జీవాలకు సరైన సమయంలో టీకాలు ఇప్పించి ఆర్థికంగా ప్రయోజనం పొందాలని సూచించారు.