NLG: 2024తో పోలిస్తే 2025లో జిల్లాలో మొత్తం నేరాలు 8,834 నుంచి 8,493కి తగ్గాయి. తీవ్ర నేరాలు 221 నుంచి 169కి తగ్గాయి. లాభం కోసం హత్యలు, దోపిడీలు సున్నాగా నమోదయ్యాయి. లోక్ అదాలత్ ద్వారా 49,943 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. ప్రాజెక్ట్ ‘శుద్ధి’ పేరుతో విద్యార్థులకు మత్తు పదార్థాల దుష్పరిణామాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని నివేదికలో తెలియజేశారు.