నారాయణపేట జిల్లా పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి కోస్గి చేరుకున్నారు. కొడంగల్ నియోజకవర్గానికి చెందిన సుమారు 3,000 మంది సర్పంచులు, వార్డు సభ్యులతో ఆయన సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా వారిని సన్మానించనున్నారు. సీఎం పర్యటనకు ఇంఛార్జ్ కలెక్టర్ సంచిత్ గంగువార్ ఆధ్వర్యంలో పక్కా ఏర్పాట్లు చేశారు.