SRCL: ఆయిల్ పామ్ సాగు అన్ని కాలాలకు అనుకూలంగా ఉంటుదని, నాలుగో ఏడాది నుంచి అధిక దిగుబడి, ఆదాయం వస్తుందని ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. ఆయిల్ పామ్ సాగుపై రైతులకు ఉద్యానవన, వ్యవసాయ, సహకార శాఖా ఆద్వర్యంలో బోయినపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో బుధవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో కలెక్టర్ పాల్గొని పలు సూచనలు చేశారు.