SDPT: చేర్యాల మండలం రాంపూర్ గ్రామంలో మూతపడిన మినరల్ వాటర్ ప్లాంట్ను సర్పంచ్ కొమురయ్య తన సొంత నిధులతో పునరుద్ధరించి వాడుకలోకి తెచ్చారు. కొన్ని నెలలుగా వాటర్ ప్లాంట్లోని యంత్రాలు చెడిపోవడంతో అధికారులు దాన్ని మూసివేశారు. దీంతో సురక్షిత మంచి నీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లారు. 50 వేలు పెట్టి మరమ్మతులు చేయించారు.