విజయ్ హజారే ట్రోఫీలో సిక్కింతో జరిగిన మ్యాచ్లో ముంబై ఘన విజయం సాధించింది. అంతకుముందు సిక్కిం 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన ముంబై 30.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 237 రన్స్ చేసింది. ముంబై బ్యాటర్లలో రోహిత్ శర్మ(155) అదరగొట్టాడు. సిక్కిం బౌలర్లలో క్రాంతి కుమార్, అంకుర్ తలో వికెట్ పడగొట్టారు.