VZM: సీఎం సహాయనిధి పేదలకు ఓ వరం లాంటిదని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన అన్నారు. బొబ్బిలికోటలోని 25 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే ఇవాళ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాల వారికి నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.