AKP: ఉచిత ఫిజియోథెరపీ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. బుధవారం అనకాపల్లి ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన ఫిజియోథెరపీ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. పలు రకాల నొప్పులతో బాధపడుతున్న వారికి ఫిజియోథెరపీ మంచి ఉపశమనం కలిగిస్తుందని అన్నారు. అలాగే నొప్పి నివారణ మాత్రలు వాడవద్దని సూచించారు.