PPM: ప్రభుత్వ ఉద్యోగులు, మీడియా ప్రతినిధులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే మెరుగైన సేవలు అందుతాయని జిల్లా కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి పేర్కొన్నారు. జిల్లా అంధత్వ నివారణ సంస్థ పర్యవేక్షణలో పుష్పగిరి కంటి ఆసుపత్రి సహకారంతో బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఉచిత కళ్లద్దాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇందులో 84 మందికి ఉచిత కళ్లద్దాలను అందజేశారు.