ELR: పోలవరం ప్రాజెక్టు సీఈవో నిర్వాసిత గ్రామమైన కొండ్రుకోటను సందర్శించి కాలనీని పరిశీలించారు. అనంతరం పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. అంగన్వాడీ కేంద్రంలో పిల్లల బరువు, ఎత్తును పరిశీలించి వారికి అందిస్తున్న పోషకాహారం వివరాలను జాయింట్ కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. తర్వాత పౌరులకు అందుతున్న సేవలపై అధికారుల నుంచి సమాచారం సేకరించారు.