VZM: పదో తరగతిలో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని వేపాడ ఎంఈవో బాల భాస్కరరావు కోరారు. బుధవారం సోంపురం జడ్పీ హైస్కూల్‌ను సందర్శించి, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. 100 డేస్ యాక్షన్ ప్లాన్‌ను విద్యార్థులు వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని MEO ఆదేశించారు. మధ్యాహ్న భోజన పథకంలో మెనూ సక్రమంగా అమలు చేయాలని ఆయన సూచించారు.