NLG: రూప్లాతండాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ధనావత్ పకీర నాయక్ తెల్లవారుజామున మృతి చెందారు. దశాబ్దాలుగా పార్టీ కోసం సేవలందించిన ఆయన మరణం కాంగ్రెస్కు తీరని లోటని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలోనూ ధైర్యంగా నిలబడి కార్యకర్తలను ఏకతాటిపై నడిపించిన పోరాట యోధుడిగా కొనియాడారు. ఆయన మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.