MBNR: జిల్లా కేంద్రంలోని బండమీదిపల్లిలో ఈనెల 27వ తేదీన నూతన కోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జి ఎన్ వి శ్రవణ్ కుమార్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జీలు లక్ష్మణ్, విజయసేన్ రెడ్డి మాధవి దేవి,నందికొండ నర్సింగరావు రానున్నారు.