SRPT: పశు వైద్య శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మునగాల మండలం బరకత్ గూడెం గ్రామ సర్పంచ్ నరసయ్య అన్నారు. బుధవారం గ్రామంలో గొర్రెలు, మేకలకు ఉచిత నట్టల నివారణ కార్యక్రమాన్ని సర్పంచ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అందించే ఉచిత నట్టల మందులను సద్వినియోగం చేసుకోవాలన్నారు.