AP: విశాఖ గాజువాక ట్రాఫిక్ ASI నరసింహరాజుపై చీటింగ్ కేసు నమోదైంది. అధిక వడ్డీ, లాభాలు ఆశ చూపి వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. బాధితుల్లో పలువురు కానిస్టేబుళ్లు, హోంగార్డులు ఉన్నారు. అయితే, నగదు తిరిగి చెల్లించాలని బాధితులు కోరగా.. బెదిరింపులకు పాల్పడుతున్నాడని ASIపై సీపీకి బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నరసింహరాజుపై కేసు నమోదు చేసినట్లు సమాచారం.