NZB: ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఇకపై రోగుల బంధువులు భోజనాలు చేయడం నిషేధమని ఆసుపత్రి సూపరిండెంట్ శ్రీనివాస్ తెలిపారు. ఆసుపత్రిలో పరిశుభ్రతను మెరుగుపర్చడంతో పాటు ఎలుకలు, క్రిమికీటకాల నివారణకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వార్డుల్లో భోజనాలు చేయడంపై నిషేధం విధించిందన్నారు. రోగుల బంధువులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.