WGL: గీసుకొండ మండలం ఊకల్ గ్రామంలో శ్రీ నాగేంద్రస్వామిని బుధవారం తెల్లవారుజామున ప్రత్యేక పుష్పాల అలంకరణతో భక్తిశ్రద్ధలతో దర్శింపజేశారు. తెల్లని మల్లె పుష్పాలు, రంగురంగుల పువ్వులతో స్వామివారి అలంకరణ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజలు నిర్వహించారు.