KRNL: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో ఏప్రిల్ నెలలో జరిగిన బీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేశారు. వర్సిటీ వైస్ ఛాన్సులర్ ప్రొఫెసర్ వి. వెంకట బసరావు ఆదేశాల మేరకు మంగళవారం రాత్రి ఫలితాలను విడుదల చేసినట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డా.ఎస్.వెం కటేశ్వర్లు తెలిపారు. 2,016 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు పేర్కొన్నారు.