శ్రీహరికోట నుంచి LVM3-M6 రాకెట్ ఈరోజు నింగిలోకి దూసుకెళ్లనున్న విషయం తెలిసిందే. అయితే, ఈ వ్యోమనౌక ప్రయోగంలో స్వల్ప జాప్యం చోటుచేసుకుంది. ప్రమాదాన్ని నివారించేందుకు స్వల్ప మార్పులు చేసినట్లు అధికారులు వెల్లడించారు. తొలుత 8:54 నిర్ణీత సమయం కాగా.. దానిని 8:55:30 సెకన్లకు మార్చారు. రాకెట్ ప్రయాణ మార్గంలోకి అంతరిక్ష వ్యర్థాలు వచ్చే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.