BPT: జిల్లాలో నిన్న సాయంత్రం జాతీయ రహదారిపై తరుచు జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించటం సామాజిక బాధ్యత అని బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వరరావు అన్నారు. జాతీయ రహదారి పక్కనున్న గ్రామాలలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాలపై తగు జాగ్రత్తలను సూచించారు. ఈ కార్యక్రమం లో డీఎస్పీ రామాంజనేయులు, మార్టూరు సిఐ శ్రీనివాసరావు అధికారులు పాల్గొన్నారు.