AP: ఈనెల 26న రాష్ట్రవ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించనున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన వికసిత భారత్-గ్యారంటీ ఫర్ రోజ్గార్, ఆజీవికా మిషన్పై అవగాహన కల్పించనున్నారు. ఈ చట్టంలోని కీలక నిబంధనలు, చట్టబద్ధ హక్కులపై శ్రామికులు, ప్రజలకు గ్రామసభల్లో అవగాహన కల్పించడంతో పాటు చర్చించనున్నారు.