HYD: సీతాఫల్మండి కార్పొరేటర్ సామల హేమ ఇందిరానగర్లో అధికారులతో కలిసి పర్యటించారు. ఇందిరానగర్ రోడ్డు నంబర్ 6లో వాటర్ లైన్ సమస్య ఉందని చెప్పారు. వెంటనే స్పందించిన కార్పొరేటర్ అధికారులతో వెళ్లి సమస్యను పరిష్కరించారు. ఈ నెల 26న రోడ్ నెంబర్ 3లో సీవరేజ్ లైన్ పనులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. దీనిని ఎమ్మెల్యే పద్మారావు శంకుస్థాపన చేస్తారని కార్పొరేటర్ వెల్లడించారు.