NZB: చందూర్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న ఆర్అండ్బీ రోడ్డుపై కేజీవీల్ ట్రాక్టర్లు, అధిక లోడు లారీలను నడపరాదని తహశీల్దార్ లకావత్ వీర్ సింగ్ హెచ్చరించారు. పనులు జరుగుతున్న సమయంలో ఎలాంటి వాహనాల వల్ల రోడ్డు పాడవుతోందని పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని, కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.