కృష్ణా: డిసెంబర్ 21వ తేదీ నిర్వహించిన పల్స్ పోలియో చుక్కల మందు కార్యక్రమం మొదటి రోజే 95.14 శాతం లక్ష్యాన్ని సాధించింది. రాష్ట్ర స్థాయిలోనే కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.పీ. యుగంధర్ని పేదకల్లేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు, సిబ్బంది మంగళవారం సన్మానం చేసి అభినందనలు తెలిపారు.