NRPT: కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తోందని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ప్రశాంత్ విమర్శించారు. మంగళవారం జిల్లా కేంద్రంలో నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… గ్రామీణ పేదల జీవనాధారమైన ఈ పథకాన్ని దెబ్బతీయడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.