ప్రకాశం: బేస్తవారిపేట మండలం పెంచికలపాడు మరియు చెట్టి చర్ల గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. మండల అధికారి మహమ్మద్ మాట్లాడుతూ.. మొక్కజొన్న పైరును విత్తన ఉత్పత్తి కొరకు సాగు చేసే రైతులు తప్పనిసరిగా కంపెనీ ప్రతినిధుల నుంచి అగ్రిమెంట్ తీసుకోవాలని తెలిపారు. పంటలో కత్తెర పురుగు నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి రైతులకు వివరించారు.