SKLM: ఆమదాలవలస-గాజుల కొల్లి వలస గ్రామ సమీపంలో ఉన్న కొండను మంగళవారం ఆర్డీవో సాయి ప్రత్యూష, డీఎస్పీ వివేకానంద పరిశీలించారు. ఇటీవల కొండ ప్రాంతం నుంచి అక్రమంగా కంకర మట్టి తరలిస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఆమె స్వయంగా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా కంకర, మట్టిని తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు.