KNR: గ్రామాభివృద్ధి కోసం మంచి పనులు చేయడం ద్వారా సర్పంచులు, ప్రజల ఆదరాభిమానాలు చూరగొనాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. గన్నేరువరం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన నూతన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులతో ఎల్ఎండీ కాలనీలోని ప్రజాభవన్లో ఆయన సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలన్నారు.