VZM: నియోజకవర్గంలోని రైతుల సాగునీటి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తున్నదని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకట్రావు అన్నారు. ఇవాళ రాజాం టీడీపీ క్యాంప్ కార్యాలయంలో ఇరిగేషన్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సాగునీటి కాలువల్లో పూడికతీత పనులు వేగవంతం చేయాలని, చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలని ఆదేశించారు.