SRD: పాఠశాలల్లో వాష్ రూమ్ కట్టించండి అంటూ.. ఓ విద్యార్థి నూతన సర్పంచ్‌ను కోరింది. సోమవారం సిర్గాపూర్ మండలంలోని రూప్లా తండాలో గ్రామపంచాయతీ సర్పంచ్‌గా శివరాం, ఉప సర్పంచ్‌గా శ్రీను, సభ్యులు ప్రమాణం చేశారు. అనంతరం పక్కనే ఉన్న పాఠశాలను సందర్శించారు. అశ్విని అనే విద్యార్థి లేచి తమ పాఠశాల సమస్యలపై వివరించింది. త్వరలో పరిష్కరిస్తానని నూతన సర్పంచి తెలిపారు.