BHPL: బీఎంఆర్ కరాటే డూ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో 4వ జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్ షిప్ 2025 పోటీలు హన్మకొండ జిల్లా కేంద్రంలో జరిగాయి. ఈ పోటీలలో భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన షావులీన్ డ్రాగన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు పాల్గొని పలు విభాగాలలో పతకాలు సాధించినట్లు సీనియర్ మాస్టర్ కరాటే శ్రీనివాస్ తెలిపారు.