RR: ఫరూఖ్ నగర్ మండలం పరిధిలోని మొగిలిగిద్ద శివారులో ఉన్న మహి గ్రానైట్స్ పరిశ్రమలో ఓ కార్మికుడు ఊపిరితిత్తుల వ్యాధితో ఆసుపత్రి పాలయ్యాడు. ప్రాణం మీదకు తెచ్చుకొని మృత్యువుతో పోరాడుతున్నప్పటికీ.. పరిశ్రమ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో బాధిత కుటుంబసభ్యులు ఆదివారం పరిశ్రమ ముందు ఆందోళనకు దిగారు. బాధితుడికి వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.